సిరాన్యూస్, సొనాల
సొనాలలో ఘనంగా ఉగాది సంబరాలు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సోనాల గ్రామంలో మంగళవారం ఉగాది సంబరాలు రైతులు ఘనంగా జరుపుకున్నారు. రైతులు సూర్యోదయానికి ముందే పొలాల్లోకి వెళ్లి భూమి పూజ చేసి పంటలు బాగా పండాలి అని భూమాతను కోరుకున్నారు. శ్రీ రామాలయంలో పంచగా శ్రావణం లో భక్తులు పాల్గొని రాశి ఫలాలు ఈ సంవత్సర మంచి చెడుల గూర్చి తెలుసుకున్నారు. అదే విధంగా సోనాలలో అంగునూరి శేఖర్ గత 18 సంవత్సరాలుగా ఉగాది పచ్చడిని గ్రామస్తులకి అందిస్తూ వస్తున్నారు. అంగునూరి శేకర్ను పలువురు అభినందించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చెట్లపల్లి సదానందం, గ్రామ పెద్దలు కానీ మురళీధర్, బద్ధం రవి,గాజుల శ్రీనివాస్ యువకులు తదితరులు పాల్గొన్నారు.