Sonala: సొనాలలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు

సిరాన్యూస్‌, సొనాల‌
సొనాలలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు

నాగుల పంచమి పర్వదిన వేడుకలు అదిలాబాద్ జిల్లాలో బోద్ సోనాలలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలో మహిళలు పెద్ద సంఖ్యలో నాగదేవత పుట్టలను దర్శించుకున్నారు. పవిత్ర శ్రావణ మాసంలో శుక్రవారం వచ్చిన నాగ పంచమిని పురస్కరించుకొని మహిళలు ఉదయమే నూతన వస్త్రాలు ధరించి వివిధ దేవాలయాలు గ్రామాల్లో ఉన్న పుట్ట ల వద్దకు చేరుకొని నాగ దేవతలకు ఆవుపాలు పోసి, పళ్ళు, ఫలహారాలు, పువ్వులు, సమర్పించారు. ఇంటి పరివారంలోని ఆత్మీయులకు ముఖ్యంగా సోదరులకి మంచి జరగాలి అన బిల్వ పత్రాలతో పాలను తీసుకొని కండ్లను శుభ్రపరుస్తారు. దీనివలన సోదరులు ఆరోగ్యంగా ఉంటారని భక్తులు నమ్మకం. ఈ వేడుకలో హిందూ పురాణాలలో పాముల ప్రాముఖ్యత , ప్ర‌కృతి సమతుల్యతను కాపాడుకోవడంలో వాటి భాగస్వామ్యాన్ని కలిగి ఉంటుంది. పాములను గౌరవించడం ద్వారా, భక్తులు వారి పర్యావరణ సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తారు.  సోనాలలో పాఠశాల ఆవరణలో ఉన్న పుట్ట దగ్గర పెద్ద ఎత్తున మహిళలు చేరుకొని పూజలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *