సిరా న్యూస్, సొనాల:
సీఎం ప్రమాణ స్వీకారానికి సొనాల వాసులు…
హైద్రబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలం నుంచి నాయకులు తరలివెళ్లారు. గురువారం హైద్రబాద్‌కు చేరుకున్న నాయకులు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేపట్టడం ప్రజలు, నిరుద్యోగుల విజయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకలు గాజుల పోతన్న, బత్తుల రమేష్, కుర్మే పోతన్న, జైపాల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.