Sonala Munnuru Kapu: సొనాల‌లో మున్నూరు కాపు సంఘ భవనం ప్రారంభం

సిరాన్యూస్,సొనాల
సొనాల‌లో మున్నూరు కాపు సంఘ భవనం ప్రారంభం

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండ‌లంలోని సోనాల గ్రామంలో ఇటీవల నిర్మించిన మున్నూరు కాపు సంఘ భవనాన్ని బుధ‌వారం ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ , మాజీ ఎమ్మెల్యే జోగు రామన్నలు ప్రారంభించారు. ఈసంద‌ర్బంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ మున్నూరు కాపు కుల బంధువులందరూ ఐక్యంగా ఉంటూ అభివృద్ధిని చేసుకోవాలన్నారు. ఈసారి రాష్ట్ర శాసనసభలో ముగ్గురు ఎమ్మెల్యేలు , ముగ్గురు ఎమ్మెల్సీల ప్రాతినిధ్యం మాత్రమే ఉందన్నారు. రాజకీయపరంగా మున్నూరు కాపులు ఎదగవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సోనాల గ్రామంలో నిర్మితమైన మున్నూరు కాపు సంఘ భవనం మున్నూరు కాపు సంఘ సోదరులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో చాలా సుందరంగా నిర్మించారన్నారు. తనవంతుగా సంఘ భవనాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి 20 లక్షల నిధులను అందజేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రసంగిస్తూ బోథ్ నియోజకవర్గంలో 18 వేల మంది వరకు మున్నూరు కాపు కులస్తులు ఉన్నారన్నారు. నా గెలుపులో వారి భాగస్వామ్యం మరువలేనన్నారు. సోనాల గ్రామం మండలం గా ఏర్పడినప్పటికీ, కార్యాలయాలు ఇంకా తరలిరానందున అవి వచ్చేలా, సంపూర్ణ మండలంగా అయ్యేలా తన వంతు కృషి చేస్తానన్నారు.తనవంతుగా సంఘ భవనానికి 10 లక్షల నిధులు మంజూరు కావడానికి సహకారం అందిస్తానన్నారు. ఎంపీ గోడం.నగేష్ మాట్లాడుతూ సోనాల గ్రామంతో ఉన్న అనుబంధాలను, ఆప్యాయతలను గుర్తుకు తెచ్చుకున్నారు. తాను ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్న సందర్భాల్లో అభివృద్ధిలో భాగంగా గ్రామానికి ఎన్నో సౌకర్యాలను సమకూర్చానన్నారు. తనవంతుగా సంఘ భవనాని కి 10 లక్షల రూపాయలను అందజేయడానికి సుముఖత వ్యక్తం చేశారు.ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ మున్నూరు కాపు కులస్తులు ఎంతో కష్టజీవులు అన్నారు .వారు ఎవరికి కూడా హాని చేయరన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ ,రామాలయ చైర్మన్ జివి రమణ,మున్నూరు కాపు కుల సంఘ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులతో పాటు గ్రామ ప్రజలు, జిల్లా వ్యాప్తంగా వచ్చిన మున్నూరు కుల సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *