సిరాన్యూస్,బోథ్
వివేకానంద స్కూల్లో జయశంకర్ జయంతి వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ సొనాల వివేకానంద స్కూల్లో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ ఇస్తారి మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు,సిద్ధాంతకర్త, ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా తన జీవితాన్ని గడిపిన ఆచార్య జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర సాధనలో చేసినటువంటి సేవలను కొనియాడారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య, కరస్పాండెంట్ ఇస్తారి, డైరెక్టర్స్:కోస్మెట్ శుద్దోధన్, మునిగెల శ్రీధర్, ఉపాధ్యాయ బృందము విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.