సిరా న్యూస్, బోథ్
సోనాల జడ్పీఎస్ఎస్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు
ఆదిలాబాద్ జిల్లా సోనాల గ్రామంలోని జెడ్పిఎస్ఎస్ పాఠశాలలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.
విద్యార్థునులందరూ ఉదయం పూటనే తీరొక్క పూలను సేకరించి ,అందంగా బతుకమ్మలను పేర్చి ,కోలాట నృత్యాలు ,బతుకమ్మ పాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడిపాడారు . అనంతరం స్థానిక వాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సచిన్ దేశ్ ముఖ్,ఉపాధ్యాయులు ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.