సిరా న్యూస్, ఆదిలాబాద్
ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
పార్టీ కోసం పదవులను తృణ ప్రాయంగా త్యజించిన త్యాగమూర్తి సోనియా గాంధీ అని మాజీ మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దిగంబర్ రావు పాటిల్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ 78 వ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు, కేక్ తినిపించుకొని తమ అభిమాన నాయకురాలి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రజల సెంటిమెంట్ గుర్తించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపల్లి నగేష్, ఐ. ఎన్. టి. యూ. సి జిల్లా అధ్యక్షులు మునిగేల నర్సింగ్, కౌన్సిలర్లు బండారి సతీష్ , సంద నర్సింగ్, యెల్మెల్వార్ రామ్ కుమార్, దర్శనాల లక్ష్మణ్, మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ ఇజ్జగిరి సంజయ్ కుమార్, నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, మునిగెల విట్టల్, బొమ్మకంటి రమేష్, అల్చెట్టి నాగన్న తదితరులు పాల్గొన్నారు.