సిరాన్యూస్, బేల
సోన్‌ఖాస్‌లో ఘనంగా సత్యశోధక్ దివస్
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం లో గల సొన్ ఖాస్ గ్రామంలో మంగళవారం గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా సత్యశోధక్ దివస్ నిర్వహించారు.ఈ సందర్బంగా గ్రామంలో జ్యోతిబా, సావిత్రిబాయి ఫూలే దంపతుల చిత్రపటాలకు పూజలు చేసి పూల మాలలు వేశారు. అనంతరం గ్రామస్తులు, యువకులు, మహిళలు సత్యశోద దివస్ గురించి మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే మహారాష్ట్రలోని పూణేలో 1873 సెప్టెంబర్ 24న స్థాపించిన సాంఘిక, సంస్కరణ,సమాజము అని అన్నారు.అణగారిన వర్గాల వారికి, ముఖ్యంగా మహిళలకు విద్య, సాంఘిక హక్కులు రాజకీయ, చైతన్యం కల్పించారని వివరించారు.జ్యోతిబా సతీమణి సావిత్రిబాయి పూలే మహిళా సమాజ విభాగానికి మొట్టమొదటి సారిగా పాఠశాల తెరిపించారని మహిళలకు చదువు వారి సారథ్యంలోనే ఫలించిందని అన్నారు.వారి ఆచార విచారాలను అభ్యసించి వారికి ఆదర్శంగా తీసుకుని భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనను గురువుగా నమ్మి రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు పొందుపరిచారని అన్నారు. యువకులు, పెద్దలు వారికి ఆదర్శంగా తీసుకొని ఏటువంటి కార్యక్రమాలకు బ్రాహ్మణులకు పిలువకుండా వారు చెప్పే మూడో నమ్మకాలను నమ్మకుండా ప్రతి ఒక్కరూ ఫూలే దంపతులకు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ అంబాదాస్ శేండే, గ్రామ ప్రెసిడెంట్ నందు నాగోసే, మాజీ సర్పంచ్ జనార్ధన్ మెస్రం, రాజారామ్, సునీల్, దీపక్, ఫక్రు, వీణ, గ్రామస్తులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.