సిరా న్యూస్,రంగారెడ్డి;
రాజేంద్రనగర్ లో ఎస్ఓటీ పోలీసులు దాడులు జరిపారు. హైదర్ షాకోట్ లోని ఓ గ్యాస్ రీ ఫిలింగ్ కేంద్రం పై దాడి చేసారు. అక్రమంగా గ్యాస్ రీ ఫిలింగ్ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. డొమెస్టిక్ సిలిండర్స్ నుండి అక్రమంగా చిన్న చిన్న సిలిండర్స్ లో రీ ఫిలింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. 100 డొమెస్టిక్ సిలిండర్స్ సీజ్ చేసారు. నిందితులను నార్సింగీ పోలీసుల కు అప్పగించారు.