సిరా న్యూస్, ఓదెల
వరి సాగు రైతుల ప్రోత్సాహం కోసం దరఖాస్తుల స్వీకరణ
వరి సాగు రైతుల ప్రోత్సాహం కోసం శనివారం సో అండ్ రీప్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరించారు. ఈసందర్బంగా ఏరియా మేనేజర్ రవళి మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామపంచాయతీ వద్ద సంస్థ అందించే 1000 రూపాయల ప్రోత్సాహం కోసం రైతుల నుండి ఆధార్ కార్డు జిరాక్స్, పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, బ్యాంకు బుక్ జిరాక్స్ తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం సంస్థ ఎగ్జిక్యూటివ్ కుమార్ మాట్లాడుతూ రైతులకు సహాయపడే నూతన సృజనాత్మక మార్గాలను గుర్తించడంపై సో అండ్ రీప్ దృష్టి సారిస్తుందన్నారు. రైతులకు వరి సాగులో నీటి సంరక్షణ మీతిన్ తగ్గింపు పద్ధతులలో విప్లవాత్మక మార్కులు చేయడమే ప్రాజెక్టు అని తెలిపారు. వరి నారు పద్ధతిలో వరి పండించే విధానం వలన కొన్ని నష్టాలు ఉన్నాయని, దానివలన నీటి వాడకం ఎక్కువ అవుతుందని, భూమి యొక్క సారం తగ్గుతుందని, పెట్టుబడి పెరుగుతుందని, నీటి నిలువ పొలంలో ఉండడం వలన మితేన్ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. వాతావరణం కాలుష్యం ఎక్కువ అవుతుందని, ఈ సమస్యలకి పరిష్కారంగా సో అండ్ రిప్ సంస్థ కొన్ని సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులను అమలు చేయబోతుందని తెలిపారు ఈ పద్ధతుల ద్వారా నీటి ఖర్చు కార్మిక ఖర్చు తగ్గడంతో పాటు చాలా సులభంగా వరి ఉత్పత్తి చేసుకోవచ్చని సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు పలు రకాలు తడి పొడి విధానం ఆరుతాడు విధానం ముఖ్యమైనవి ఈ పద్ధతులు పాటించడం వలన వాతావరణంలోకి విడుదలయ్యే మిధే న్ వాయువు తగ్గితూ ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుందని తెలిపారు. మట్టి నాణ్యత పెరిగి భూసారం మెరుగుపడుతుందని, ఈ పద్ధతులు పాటించడం చాలా సులువు అధిక ఎరువులు వాడడం కూడా అవసరం లేదని తెలిపారు. నీటి నిల్వ లేకపోవడం వలన నేలలోఉండే సూక్ష్మ జీవరాశులు అభివృద్ధి చెందుతాయని, అంతేకాకుండా ఈ పద్ధతిలో పాటించిన అందుకు గాను రైతులకు ఎకరానికి ప్రోత్సాహం కింద వెయ్యి రూపాయలు అందజేయనున్నారాని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ అనామిక, రాజ్ కుమార్ .రాజేష్ తదితరులు పాల్గొన్నారు.