సిరా న్యూస్ కుందుర్పి
నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ సూచించారు. గురువారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన ఎస్సై, ఆ పైస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళలపై నేరాలు జరుగకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నేరాల నియంత్రణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గత ఎన్నికల్లో జరిగిన నేరాలను సమీక్షించి ఆయా ప్రాంతాల్లో ఈసారి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల దృష్ట్యా జిల్లాలోని అందరు పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముందస్తు ప్రణాళికలు, చర్యలు అవసరం ఫ్యాక్షన్, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. నేర చరిత కల్గిన వారు, ట్రబుల్ మాంగర్స్ పై ప్రత్యేక నిఘా కొనసాగించాలని చెప్పారు. మిస్సింగు కేసులు, గుర్తు తెలియని మృత దేహాల కేసులకు శీఘ్రంగా పరిష్కారం చూపాల్సి ఉందన్నారు.