సిరాన్యూస్, నిర్మల్
క్రిప్టో కరెన్సీ,బిట్ కాయిన్ ముఠా అరెస్ట్ : ఎస్పీ డా.జానకి షర్మిల
* చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు
చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల అన్నారు. క్రిప్టో కరెన్సీ,బిట్ కాయిన్ ముఠా ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో, ఖానాపూర్ నియోజకవర్గం లోని కొంతమంది ఇప్పుడున్న టెక్నాలజీతో ప్రజలను ఏదో ఆశ చూపించి మోసాలు చేస్తున్నారు. కస్టపడ కుండాడబ్బులు సంపాదించాలని దురాశ తో కొంత మంది కలసి ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళని, వ్యాపారాలు చేసే వాళ్ళని వారితో పాటు మద్య తరగతి వారిని ఏదో ఆశ చూపి బురిడి కొట్టించి వారందరినీ ఆన్లైన్ కాయిన్ వ్యాపారం గురించి తెలియపరచి వారితో డబ్బులు కట్టిస్తున్నారు. జిల్లా లో కడెం మండలం నుండి ప్రారంబించి ఇలా అన్ని జిల్లాల ప్రాంతాల ప్రజలను మోసాలు చేయడమే వీరి పని. కొన్ని రోజుల తర్వాత ఈ స్క్రిప్ట్ కాయిన్ మోసపూరితమని తెలవడంతో ప్రజలు పోలీసులను ఆశ్రయించారు. నిర్మల్ పోలీస్ మీ పోలీస్ లో బాగంగా ఈ విషయాని జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల తెలుసుకుని అవినాష్ కుమార్ ఐపీస్ , నేతృత్వం లో ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. అయితే మీరు ప్రత్యేక బృందాలుగా విడిపోయి వారిని పట్టుకోవడం జరిగిందని. 1) సల్ల రాజ్ కుమార్, ఊరు, నవాబ్ పెట్, కడం మండలం, ని విచారించగ మొత్తం నేరం ఒప్పుకుని అన్నీ వివరించారు .తరువాత 2) సాయి కిరణ్, 3) కందేలా నరేష్, వృత్తి: ఎస్ జి టి, టీచర్, గంగాపూర్, కడం మండలం ,ప్రియదర్శిని నగర్, నిర్మల్.4) గంగాధర్, వృత్తి, ఎక్సైజ్ ఎస్ఐ,5) మహేష్, వృత్తి, ఏ ఆర్ పోలీస్ కానిస్టేబుల్, తీసుకు వచ్చి విచారణ మొదలు పెట్టారు. మీరు ఎంత మంది ని జాయిన్ చెపిస్తే మీకు అంతా లాభాలు వస్తుందని పెద్ద పెద్ద ఆశలు చూపించి వారందరిని మభ్యపెట్టి పెట్టి ఇట్టి వ్యాపారంలో చాలా మంది ఉద్యోగస్తుల్ని చిన్న, మధ్య తరగతి వారిచే పెట్టుబడి పెట్టించి నెలకి కొంత సొమ్ము వారికి చెల్లిస్తూ విస్తరించారు. ఈవ్యాపారానికి ఎటువంటి గుర్తింపు లేదు. బాధితుల పై ఈ పథకం ప్రభావం తీవ్రంగా ఉంది. అమాయకుల నుంచి వసూలు చేసిన సొమ్ము దుర్వినియోగం అవుతోంది, అక్రమార్కులు చేసిన తప్పుడు వాగ్దానాలను నమ్మి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ వ్యాపారం వెబపోర్టల్ పనిచేయక పోతే ముందుగా జాయిన్ అయిన వారు లభ్యపడతారని కానీ ఎక్కువ శాతం కొత్తగా పెట్టుబడి పెట్టిన వారు నష్టపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా వాసులు ఇలాంటి మోసపూరితమైన బిజినెస్లకు మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఇలాంటి ఆన్లైన్ బిజినెస్లకు పెట్టుకోవద్దని, మీ కుటుంబాలను రోడ్డల పాలు చేసుకోవద్దని, ఇలాంటివారు మళ్లీ ఎవరైనా వస్తే మాకు సమాచారం తెలపండి అని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. అలాగే ఈ కేసుని విచారించడంలో చక్కటి ప్రతిభ చూపించినటువంటి అవినాష్ కుమార్ ఐపీఎస్ ఏఎస్పీ ,ని డిఎస్పి గంగారెడ్డి, నిర్మల్ వారితోపాటు నిర్మల్ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, నిర్మల్ రూరల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ , ఎస్సైలు సాయి కృష్ణ, ఎం రవి, రవీందర్ కానిస్టేబుల్ తిరుపతి , గణేష్, శోకత్, సతీష్ లను ఎస్పీ ప్రశంసించారు.