సిరాన్యూస్, బోథ్
అసాంఘిక కార్యకలాపాలను సహించేది లేదు: ఎస్పీ గౌస్ అలం
ఆదిలాబాద్ జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు సహించబోమని, ముఖ్యంగా గుట్కా మట్కాతోపాటు పేకాట వంటి వాటిని పూర్తిగా నిర్మూలిస్తామని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ అలం అన్నారు. బుదవారం ఆదిలాబాద్ జిల్లా పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈసందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లయితే సహించేది లేదన్నారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర నుండి గుట్కా అక్రమ రవాణా జరుగుతున్న విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకురాగా తమ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని, పూర్తిగా అడ్డుకోవడం జరుగుతుందన్నారు. గుట్కా అక్రమ రవాణా దారుల విక్రయదారుల సమాచారాన్ని తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. శాంతి భద్రత పరిరక్షణలో జిల్లాలో పోలీసులు ముందు చూపుగా వ్యవహరించి తగు చర్యలు తీసుకుంటున్నారన్నారు. గంజాయి సాగు విక్రయాల పైన దృష్టి సారించడం జరిగిందని, బోథ్ మండలంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వారిని పట్టుకుని జైల్లోకి పంపించడం జరిగిందన్నారు. యువత గంజాయి కి బానిసకావద్దని సూచించారు. విలేకరుల సమావేశంలో ఎస్పీతోపాటు సిఐ రమేష్ ఎస్ఐ ప్రవీణ్లు పాల్గొన్నారు.