SP Gauss Alum: జిల్లా నుండి గుట్కాను సమూలంగా రూపుమాపుతాం:  ఎస్పీ గౌస్ ఆలం

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
జిల్లా నుండి గుట్కాను సమూలంగా రూపుమాపుతాం:  ఎస్పీ గౌస్ ఆలం
* రూ. 44,19,000/- విలువచేసే నిషేధిత గుట్కా స్వాధీనం
* జిల్లా వ్యాప్తంగా నిరంతరం గుట్కా పై దాడులు కొనసాగుతాయి
* అదిలాబాద్ వన్ టౌన్ లో రెండు కేసులు నమోదు

జిల్లా నుండి గుట్కాను సమూలంగా రూపుమాపుతామ‌ని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో జిల్లా ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడారు. జిల్లా ఎస్పీ గౌష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైమండ్ ట్రాన్స్పోర్ట్ గోడౌన్‌లో తనిఖీ చేయగా అందులో రూ 41,31,500/- విలువ గల రాష్ట్ర ప్రభుత్వా నిషేధిత గుట్కా లభించిందని తెలిపారు. గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్న ఏ1)ఎస్‌కె ఎస్ కే రహమతుల్లా ( ఖానాపూర్ ,ఆదిలాబాద్), ఏ 2) అర్బాజ్ ఖాన్ ( అస్లాం ట్రేడర్స్) , ఏ3) సైఫుల్లా ఖాన్, ఏ 4) షమీముల్లా ఖాన్ ,ఏ 5) పసివుల్లా ఖాన్ , ఏ 6) సాజిదుల్లా ఖాన్ ఈ ఆరుగురిపై ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 261/2024 తో సెష‌న్‌ 270,273 ఐపీసీ , 7(1)(20) సిగరెట్ అండ్ టొబాకో యాక్ట్ లతో కేసు నమోదు చేయబడిందని తెలిపారు. గోడౌన్ నుండి ధరివల్ టొబాకో, అన్వర్ టొబాకో, ఆర్ ఎన్ ఎక్స్ ఎల్, 999 షార్ట్, యూకే టొబాకో, తోట టొబాకో, జెకె టొబాకో లాంటి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన గుట్కా లభించిందని తెలిపారు. అదేవిధంగా అంబేద్కర్ చౌక్‌లో గల అస్లాం ట్రేడర్స్ లో ఆకస్మిక దాడి నిర్వహించగా, అందులో దాదాపు 20 రకాల రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన గుట్కా లభించిందని వాటి విలువ రూ 2,87,500/- ఉంటుందని తెలిపారు. అదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 260/2024 తో సెష‌న్‌ 270,273 ఐపీసీ, 7(1)(20) సిగరెట్ అండ్ టొబాకో యాక్ట్ తో, ఏ1) అర్బాజ్ ఖాన్ ( అస్లాం ట్రేడర్స్) , ఏ2) సైఫుల్లా ఖాన్@ అస్లాం, ఏ3) షమీముల్లా ఖాన్ ఆలియాస్ శము, ఏ 4) పసివుల్లా ఖాన్ , ఏ 5) సాజిదుల్లా ఖాన్ ఈ ఐదుగురిపై కేసు నమోదు చేయబడిందని తెలిపారు. రెండు కేసులలో మొత్తం రూ 44,19,000/- విలువచేసి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన గుట్కా లభించిందని తెలిపారు. గుట్కాను జిల్లా వ్యాప్తంగా సమూలంగా రూపుమాపేంత వరకు ఈ దాడులు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఎటువంటి సమాచారమైన జిల్లా పోలీసు అధికారులకు ప్రజలు తెలియజేయవచ్చని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *