SP Gauss Alum: బేల‌ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ గౌస్ ఆలం

సిరా న్యూస్,బేల‌
బేల‌ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ గౌస్ ఆలం
* పోలీస్ స్టేష‌న్‌లో మొక్క‌లు నాటిన ఎస్పీ

అదిలాబాద్ జిల్లా బేల మండ‌ల‌ పోలీస్ స్టేషన్ ను గురువారం అదిలాబాద్ జిల్లా ఎస్పీ ఎస్పీగౌస్ ఆలం త‌నిఖీ చేశారు. ఈసంద‌ర్భంగా జిల్లా ఎస్పీకి స్థానిక ఎస్.ఐ రాధికా, సీఐ, డీఎస్పీ ఘన స్వాగతం పలికారు. అనంత‌రం మండల పోలీసుల నుండి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. ఈసంద‌ర్బంగా పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించారు. మండలంలో ప్రతి రోజు ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయ‌ని ఎస్.ఐ రాధికను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించాలని అన్నారు.వచ్చిన ఫిర్యాదుపై వెంటనే బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. సమస్యలు సృష్టించే వారిపై ప్రత్యేక దష్టి సారించాలని అన్నారు. స్టేషన్‌ పరంగా పోలీస్‌ సిబ్బందికి పలు సూచనలు, సలహలు చేయడం జరిగింది. అనంతరం పోలీస్ స్టేషన్లో ఎస్పీ మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ సాయినాథ్ పోలీసు శాఖలో సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *