సిరాన్యూస్, ఆదిలాబాద్
సుదీర్ఘకాలం సేవలు అందించినందుకు అభినందనలు : ఎస్పీ గౌష్ ఆలం
* ఎస్సై సి రామారావు, ఏఎస్ఐ మహమ్మద్ జహీరుద్దీన్లకు ఘన సన్మానం
దాదాపు 40 సంవత్సరములు పాటు పోలీసు వ్యవస్థకు సేవలందించి పదవీ విరమణ పొందిన అధికారులకు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అభినందనలు తెలిపారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో పదవీ విరమణ పొందుతున్న అధికారులను వారి కుటుంబ సభ్యుల నడుము శాలువా, పూలమాలతో సత్కరించారు. అనంతరం బహుమతి ప్రదానం చేసి అభినందనలు తెలియజేశారు. ఈసందర్బంగా ఆదిలాబాద్ వన్ టౌన్ ఎస్ఐ సి రామారావు, రూరల్ పోలీస్ స్టేషన్ ఎ ఎస్ఐ మహమ్మద్ జహీరుద్దీన్ లు పదవీ విరమణ పొందారు. ఈసందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కాపాడుతూ సంతోషంగా జీవించాలని అన్నారు. మొదటగా ఇరువురు అధికారులతో చర్చించి పదవి విరమణ కావించడం జరిగిందన్నారు. పదవీ విరమణ పొందిన అధికారులు శేష జీవితాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందంగా గడపాలని జిల్లా ఎస్పీ కోరుతూ ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనం వరకు సాగనంపడం జరిగింది. కార్యక్రమంలో పదవి విరమణ పొందే అధికారుల కుటుంబ సభ్యులు, సీసీ దుర్గం శ్రీనివాస్, జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, కోశాధికారి గిన్నెల సత్యనారాయణ, చిందం దేవిదాస్, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.