సిరాన్యూస్, ఆదిలాబాద్
నలుగురు పోలీస్ అధికారులకు సన్మానించిన ఎస్పీ గౌష్ ఆలం
సుదీర్ఘ కాలం పాటు పోలీసు వ్యవస్థకు సేవలందించి ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగడానికి అహర్నిశలు కష్టపడిన ప్రతి ఒక్కరి కృషిని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అభినందించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో జిల్లా నుంచి పదవీ విరమణ పొందుతున్న నలుగురు పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ కుటుంబ సభ్యుల సమక్షంలో శాలువా పూలమాలతో సన్మానించి బహుమతి ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, పోలీసు వ్యవస్థలు సుదీర్ఘ కాలం పాటు సేవలందించి, సంఘవిద్రోహశక్తులతో పోరాడి, ప్రశాంత వాతావరణంలో ప్రస్తుత జిల్లా ఉండడానికి కారణమైన సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. సిబ్బంది ప్రతి ఒక్కరికి ప్రతి పండగలాగే పదవీ విరమణ దినోత్సవం కూడా ముఖ్యమైనదని తెలియజేశారు. సిబ్బంది ఎలాంటి అనారోగ్య కారణాలు లేకుండా పదవీ విరమణ పొందడం సంతోషకరమని, పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలను కాపాడుకుంటూ కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించాలని సూచించారు. ఎం ఉషన్న ( సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జిల్లా శిక్షణ కేంద్రం) ఎస్డి కాజా గౌస్ మొయినుద్దీన్ @ మోబిన్ ( సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్), పి యువరాజ్ ( అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్) పీ లింగన్న (హెడ్ కానిస్టేబుల్ సిరికొండ పిఎస్) పదవి విరమణ పొందారు. కార్యక్రమంలో అదనపు ఎస్పి ఆపరేషన్ బి సురేందర్రావు, డీఎస్పీ బి సురేందర్ రెడ్డి, సీసీ దుర్గం శ్రీనివాస్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, సభ్యులు గిన్నెల సత్యనారాయణ, చిందం దేవిదాస్, జైస్వాల్ కవిత, కుటుంబ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.