సిరాన్యూస్, ఆదిలాబాద్
రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన షేక్ షరీన్ పర్వీన్‌ను సన్మానించిన ఎస్పీ గౌష్ ఆలం
* జీవితంలో మరిన్ని విజయాలను సాధించాలి
* అన్నయ్య ప్రోత్సాహం వల్లే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను : షేక్ షరీన్ పర్వీన్
పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు ఎదిగినప్పుడు జిల్లా పోలీసుల కీర్తి ఉన్నత స్థానాలకు చేరుతుందని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విడుదల అయిన డీఎస్సీ ,స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఫలితాలలో ఆదిలాబాద్ జిల్లా కు చెందిన కానిస్టేబుల్ షేక్ ఇంజమాముల్ హక్ చెల్లెలు షేక్ షరీన్ పర్వీన్ రాష్ట్రంలోనే స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ విభాగంలోని ఉర్దూ మీడియం నందు 80.03 మార్కులతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది, అదేవిధంగా రాష్ట్రంలోని డీఎస్సీ ఎస్జిటి లో 79.00 మార్కులతో రెండవ స్థానాన్ని సాధించింది, జిల్లాలోస్కూల్ అసిస్టెంట్ , డీఎస్సీ ల నందు మొదటి స్థానాలను సాధించింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కుటుంబ సభ్యుల సమక్షంలో విద్యార్థిని శాలువా, బహుమతిని ప్రదానం చేసి అభినందించారు. మరిన్ని ఉన్నత లక్ష్యాలను సాధించి కుటుంబ సభ్యుల పేరును జిల్లా పోలీసుల కీర్తిని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లాలని సూచించారు. అన్నయ్య ఒకవైపు ఉద్యోగం చేస్తూ కుటుంబ బాధ్యతలను మోస్తూ చెల్లెలు చదువుకు కావలసిన వాటిని అందిస్తూ తనను ప్రోత్సహించడం జరిగిందని విద్యార్థిని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిసి దుర్గం శ్రీనివాస్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ జైస్వాల్ కవిత, కుటుంబ సభ్యులు తండ్రి మెహబూబ్, అన్నయ్య షేక్ ఇంజమాముల్ హక్, తమ్ముడు ఇమ్రాన్ నజీర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.