SP Goush Alam: విత్త‌నాల అక్ర‌మ ర‌వాణ అరిక‌ట్టేందుకు ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు : ఎస్పీ గౌష్ ఆలం

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
విత్త‌నాల అక్ర‌మ ర‌వాణ అరిక‌ట్టేందుకు ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు : ఎస్పీ గౌష్ ఆలం
* 36 విత్తన గోడౌన్స్ వద్ద ప్రత్యేక బృందాలతో తనిఖీ
* అక్రమ రవాణాకు జిల్లా వ్యాప్తంగా ఐదు చెక్ పోస్టులు ఏర్పాటు

విత్తనాల అక్రమ రవాణాలను, అక్రమ నిలువలను అడ్డుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తూ ఆకస్మిక తనిఖీల నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ తెలిపారు. శుక్రవారం అక్రమ రవాణా జరగకుండా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విత్తన గోడౌలను పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో కలిసి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విత్తనాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి, అక్రమ నిలువలు జరగకుండా అడ్డుకోవడానికి రెవెన్యూ, పోలీస్ అధికారులచే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా గల 36 విత్తన గోడౌన్స్ వద్ద అధికారులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని పలు గోడౌన్స్ ను పరిశీలించి విత్తనాల రాకపోకలను తనిఖీ చేశారు. ప్రధానంగా గోడౌన్స్ లో ఎటువంటి నకిలీ విత్తనాలు లేకుండా విత్తన సంచులను పరిశీలించి తనిఖీ చేశారు. గోడం సిబ్బందితో మాట్లాడుతూ నిలువల ప్రతి ఒక్క రాకపోకలను, సమయం, తేదీ, పేరుతో నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో నకిలీ విత్తనాలను పూర్తిగా అడ్డుకోవడానికి మండలాల వారీగా వ్యవసాయ అధికారులతో కలిసి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేసి ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మహారాష్ట్ర నుండి నకిలీ విత్తనాల అక్రమ రవాణా జరగకుండా శంకర్ గూడా, ఆనంద్ పూర్, పిప్పర వాడ, లక్ష్మీపూర్, ఘన్పూర్ వద్ద చెక్పోస్ట్లను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. నకిలీ విత్తనాల అడ్డుకట్టకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ నకిలీ విత్తన వ్యాప్తిని అడ్డుకుంటున్నట్టు తెలియజేశారు. ప్రజలు, రైతులు అక్రమ నిలువలపై, రవాణాపై, నకిలీ విత్తన తయారీపై ఎటువంటి సమాచారాన్ని అయినా జిల్లా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో డిఎస్పి ఆదిలాబాద్ ఎల్ జీవన్ రెడ్డి, ఒకటవ పట్టణ సీఐ కే సత్యనారాయణ, రెండవ పట్టణ సీఐ అశోక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *