SP Goush Alam: మత్తుతో జీవితాలు చిత్తు:  ఎస్పీ గౌష్ ఆలం

సిరాన్యూస్‌, ఆదిలాబాద్
మత్తుతో జీవితాలు చిత్తు:  ఎస్పీ గౌష్ ఆలం
* గంజాయి రహిత సమాజాన్ని నిర్మిద్దాం
* విద్యార్థులతో డ్రగ్స్ పై పోరాటం చేస్తానని ప్రతిజ్ఞ
* పట్టణంలో భారీ ర్యాలీ

మత్తుతో జీవితాలు చిత్తు అవుతాయ‌ని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. బుధ‌వారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వ‌హించారు. ఈ ర్యాలీని కలెక్టర్ చౌరస్తాలో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ప్రారంభించారు. ఈ ర్యాలీలో పోలీసులు, విద్యార్థిని, విద్యార్థులు, ప్రజలతో కలిసి డ్రగ్స్ రహిత సమాజాన్ని సృష్టిస్తామంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు. అంత‌కు ముందు పట్టణంలోని వివిధ కళాశాలల విద్యార్థిని, విద్యార్థులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని డిఎస్పి డిసిఆర్బి కే సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ పై జరుగుతున్న పోరాటంలో భాగస్వామ్యం అవుతానని, డ్రగ్స్ రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు తనవంతు కృషి చేస్తానని, జీవితంలో డ్రగ్స్ కి దూరంగా ఉంటూ ఉన్నతమైన భవితను సాధిస్తానని ప్రతిజ్ఞ చేయించారు. తదుపరి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యువతకు, విద్యార్థిని విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల చదువు, భవిత, భవిష్యత్తు నాశనమైతాయని తెలియజేశారు. యువతకు పాఠశాలలలో, కళాశాలలలో మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కల్పించేందుకు కళాశాల ప్రిన్సిపల్, పోలీసు సిబ్బంది ద్వారా ఆంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి చైతన్య పరచడం జరుగుతుందని తెలిపారు. గ్రామ సభలలో, మండల కేంద్రాలలో ప్రజలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గంజాయి డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూ, గంజాయి లాంటి వాటిని సాగు చేయడం రవాణా చేయడం చేస్తే ప్రభుత్వం ద్వారా వచ్చే సత్ఫలితాలను కోల్పోతారని కేసులలో భాగస్వామ్యం అవుతారని తెలియజేయాలన్నారు. చిన్నతనం నుండే మత్తు పదార్థాల వినియోగం వల్ల భవితను నాశనం చేసుకోవడం నేరాలకు పాల్పడడం లాంటి వాటికి అలవాటు పడతారని, అవి జరగకుండా మొదట విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. మత్తు పదార్థాలకు బానిసైన వారిని డి అడిక్షన్ సెంటర్ల ద్వారా బాగుపరిచేందుకు కృషి చేయాలని సూచించారు. పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా మత్తుపదార్థాలు లేని సమాజాన్ని సాధించడం మన అందరి లక్ష్యంగా ఉండి పనిచేస్తానని “యాంటీ డ్రగ్ సోల్జర్” అనే ఫోటో పాయింట్ వద్ద ఛాయాచిత్రాలను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో అవగాహన ర్యాలీలు నిర్వహించి మత్తు పదార్థాల బారిన పడకుండా ప్రజలకు చైతన్య పరచడం జరిగింది. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్రావు, డీఎస్పీలు ఎన్ జీవన్ రెడ్డి, కే సురేందర్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు, రిజర్వ సిబ్బంది,డి డబ్ల్యు సబిత, డిసిపి ఓ రాజేంద్ర ప్రసాద్, మిషన్ కోఆర్డినేటర్. యశోద, సఖి నిర్వాహకురాలు సరస్వతి, నలంద కళాశాల, విద్యార్థి కళాశాల, ప్రభుత్వ జూనియర్ , డిగ్రీ కళాశాల, ఎన్ సి సి విద్యార్థులు, కళాశాలల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *