సిరాన్యూస్, ఆదిలాబాద్
బహిరంగ వేలానికి విశేష స్పందన: జిల్లా ఎస్పీ గౌష్ ఆలం
* వేలంపాటలో పాల్గొన్న 103 మంది ఔత్సాహికులు
ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆదిలాబాద్ జిల్లాలోని సర్వీసులో లేనటువంటి నిరుపయోగంగా ఉన్నటువంటి కంప్యూటర్లు, ప్రింటర్స్, కిట్ ఆర్టికల్స్, పాతబడిన బెడ్లు, ఇనుప సామాగ్రి స్టోర్ వస్తువులను బహిరంగ వేలం పాట నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పాల్గొన్నారు. ఈ వేలంపాట కార్యక్రమం కమిటీ సభ్యుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుండి ఔత్సాహికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పాతబడిన పోలీసు కార్యాలయాలలోని మరియు పోలీస్ స్టేషన్లోని వస్తువులను బహిరంగ వేలం నిర్వహించడం తో దాదాపు 103 వ్యక్తులు వేలం పాటలో పాల్గొని విజయవంతం చేశారు. చివరగా వేలంపాట ముగిసే సరికి వస్తువులను మహారాష్ట్ర నాందేడ్ చెందిన మహమ్మద్ అలీ ఫక్రుద్దీన్ రూ 6,11,000/- లకు వేలం పాట ద్వారా స్వీకరించడం జరిగింది. వేలంపాట దాదాపు 128 రకాల వస్తువులను బహిరంగ వేలం ద్వారా స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి ఆపరేషన్ బి సురేందర్ రావు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి పోతారం శ్రీనివాస్, పరిపాలనాధికారి ఏవో భక్త ప్రహల్లాద్, సూపరిండెంట్ గంగాధర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఏ నవీన్, టి మురళి, చంద్రశేఖర్ రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.