SP KKN Anburajan: ఉద్యోగుల సేవలు అభినందనీయం…

సిరా న్యూస్, కందుర్పి:

ఉద్యోగుల సేవలు అభినందనీయం…
+ అనంతపూర్‌ ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌

డిపార్టెంట్‌లో వివిద హోదాల్లో పనిచేసి పదవి విరమణ పొందిన, బదిలీపై వివిద జిల్లాలకు వెళ్తున్న పోలీసు అధికారుల సేవలు అభినందనీయమని అనంతరపూర్‌ ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ అన్నారు. శుక్రవారం ఆయన కందుర్పి మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన అత్మీయ వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న ఏఆర్‌ అదనపు ఎస్పీ ఏ హనుమంతు, గుంతకల్లు డీఎస్పీ యు. నరసింగప్ప, అనంతపూర్‌ డీఎస్పీ జి ప్రసాద్‌ రెడ్డి, పదవి విరమణ పొందిన సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు, తదితరులను శాలువా, పూలమాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రముఖుల పర్యటన బందోబస్తు, జిల్లాలో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారం, తదితర అంశాల్లో ఉత్తమ సేవలందించారని వారిని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *