నిరంతర కట్టుదిట్టమైన మూడంచల భద్రతా పర్యవేక్షణలో ఎన్నికల ఈవీఎంలు – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

 

నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డు స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఎన్నికల ఈవీఎంలు

సిరా న్యూస్,నాగర్ కర్నూల్;

నాగర్ కర్నూలు జిల్లాలోని నాగర్ కర్నూలు, అచ్చంపేట,కొల్లాపూర్ నియోజకవర్గాల్లో గురువారం జరిగిన ఎన్నికలకు సంబంధించిన
3 నియోజకవర్గాల్లో 802 పోలింగ్‌కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వహించిన ఎన్నికల అధికారులు, సిబ్బంది ఆయా కేంద్రాల నుంచి వారికి కేటాయించిన ప్రత్యేక వాహనాల్లో డిస్ర్టిబ్యూషన్‌ కేంద్రా రూట్ల వారీగా, కేంద్రాల వారీగా ఈవీఎంలను ఎన్నికల సామాగ్రిని తిరిగి అధికారులు స్వాధీనం చేసుకొని పూర్తిస్థాయి పరిశీలన పూర్తి అయిన తర్వాత స్వాధీనం చేసుకున్నారు. అనంతరం
ఈవీఎంలను శుక్రవారం ఉదయం నాగర్ కర్నూల్ నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో మూడు నియోజకవర్గాల ఎన్నికల అబ్జర్వర్లు మితిలేష్ మిశ్రా, సతీష్ కుమార్ లతో కలిసి జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో పోలైన ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రిని స్ట్రాంగ్‌రూల్లో భద్రపరిచారు.
ఈవీఎంలను పటిష్ఠ బద్రత మధ్య స్ర్టాంగ్‌రూంలో భద్రపరిచారు.
ఆయా నియోజకవర్గాల ఈవీఎంల స్ట్రాంగ్ రూములకు మూడు అంచల భద్రత ఏర్పాటు చేశారు.
నియోజకవర్గాల వారీగా వేరు వేరు గదుల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల సీల్ చేసి సంతకాలు చేశారు.
ప్రతిష్ట భద్రత మధ్య నిరంతర బందోబస్తు పకడ్బందీగా ఉండనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
స్ట్రాంగ్ రూముల చుట్టుపక్కలకు ఏ ఒక్కరిని అనుమతించోద్దని భద్రతా సిబ్బందిని ఆదేశించారు.
ఈ నెల మూడో తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *