Special Bus: ప్రజా సమస్యలే పరిష్కారం లక్ష్యంగా

సిరా న్యూస్,జైనథ్‌:

ప్రజా సమస్యలే పరిష్కారం లక్ష్యంగా
– ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌
– లక్ష్మిపూర్‌కు ప్రత్యేక బస్సు సర్వీసు ప్రారంభం
– రిబ్బన్‌ కట్‌ చేసిన ఎమ్మెల్యే పాయల్‌ శంకర్, డీఎం కల్పన

నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో నెలకొని ఉన్న ప్రజా సమస్యలే పరిష్కార లక్ష్యంగా కృషి చేస్తానని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద జైనథ్‌ మండలం లక్ష్మిపూర్‌ గ్రామానికి బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించారు. ఆదిలాబాద్‌ ఆర్టీసీ డీఎం కల్పనతో కలిసి రిబ్బన్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ లక్ష్మిపూర్‌ గ్రామానికి బస్సు సౌకర్యం లేదని ఇటీవలే ప్రజలు తనకు వినతి పత్రాన్ని అందించడం జరిగిందని పేర్కొన్నారు. దీంతో ఆర్టీసీ అధికారులతో మాట్లాడి సేవలను పునరుద్ధరించడం జరిగిందని తెలిపారు.

హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు…


గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని లక్ష్మిపూర్‌ గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన పాయల్‌ శంకర్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్లగా తమ గ్రామానికి ప్రత్యేక బస్సు సర్వీసును పునరుద్ధరించారని హర్షం వ్యక్తం చేశారు. దీంతో గ్రామం నుంచి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి వచ్చే విద్యార్థులు, ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ప్రత్యేక బస్సుతో ప్రతి చిన్న విషయానికి ప్రైవేట్‌ వాహనాలపై ఆధారపడే బాధ తప్పిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైనథ్‌ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *