అడవుల రక్షణకు ప్రత్యేక విభాగం..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
సిరా న్యూస్,అమరావతి;
మడ అడవుల రక్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల కోసం 110 ఎకరాల మడ అడవుల్ని తొలగించిందని, ఈ అంశంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపించేందుకు అవసరమైన కుంకీ ఏనుగులను కర్ణాటక నుంచి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని పవన్‌ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *