సిరాన్యూస్, బేల
మొక్కలు నాటి సంరక్షించాలి : మండల ప్రత్యేక అధికారి మనోహర్
* స్వచ్చదనం, పచ్చదనంలో మొక్కలు నాటిన అధికారులు
ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని మండల ప్రత్యేక అధికారి మనోహర్ అన్నారు.ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి గ్రామ పంచాయతీలోని ఇంటి ఆవరణలో కనీసం ఒక్క ముక్కైనా నాటాలని పేర్కొన్నారు.ఈ సందర్భంగా బేల మండల కేంద్రంలోని పలు దుకాణాలను తనిఖీ చేసి నీటి నిల్వ ఉన్నచోట వాటిని తొలగించేశారు. ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. స్వచ్ఛదానం పచ్చదనంలో కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహేందర్ కుమార్, వంశీకృష్ణ ఎంపీవో వినోద్ కుమార్పంచాయతీ కార్యదర్శి సురేష్ తదితరులు ఉన్నారు.