గ్రామాభివృద్ధిలో ప్రత్యేక అధికారులు కీలకం

 సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;
గ్రామాల అభివృద్ధిలో గ్రామ పంచాయతి ప్రత్యేక అధికారుల విధులు, బాధ్యతలు చాలా ముఖ్యమైనవని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం కాటారం మండల పరిషత్ కార్యాలయంలో కాటారం డివిజన్ గ్రామ పంచాయతి ప్రత్యేక అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరాయంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం ముగిసినందున పారిశుధ్య కార్యక్రమాలు చాలా ముఖ్యమని మండల ప్రత్యేక అధికారులు గ్రామాల్లో వారంలో రెండు రోజులు తనిఖీలు చేస్తూ పర్యవేక్షణ చేయాలని తెలిపారు. గ్రామ పంచాయతీ సిబ్బంది విధులను పర్యవేక్షణ చేయటం చాలా ముఖ్యమని తెలిపారు. ప్రత్యేక అధికారులు పర్యటనలో గుర్తించిన అంశాలను పరిశీలించడానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. పాఠశాలలు, సబ్ సెంటర్స్, రెసిడెన్సియల్ హాస్టల్స్, గ్రామపంచాయతీ భవనాలు, ప్లాంటేషన్ కంపోస్ట్ షెడ్డు, వైకుంఠధామాలు తనిఖీ చేయాలని, తనిఖీ ఫోటోలను గ్రూపులో పోస్ట్ చేయాలని తెలిపారు. మన గ్రామపంచాయతీ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలని అదే మన గోల్ అని తెలిపారు. వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.
గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయటం వల్ల గ్రామాలు స్వచ్ఛతను సంతరించుకుని వ్యాధులు దరిచేరని సమాజం ఏర్పడుతుందని అన్నారు. గ్రామాలు స్వచ్చతకు జరుగుతున్న స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. రహదారులు వెంబటి వ్యర్దాలు తొలగించాలని అక్కడ మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించే చర్యలు చేపట్టాలని తెలిపారు. గ్రామపంచాయతీ అధికారులు పర్యవేక్షణ చేయడం లేదని అపవాదులు రావొద్దని ఆయన పేర్కొన్నారు. ప్రజల సంక్షేమంలో మీరు భాగస్వాములుగా ఉన్నారని, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మీ అధికారాలను, విధులను వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.ఆరుబయట వ్యర్ధాలు కాల్చితే చర్యలు తీసుకోవాలని, కాల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయని తద్వారా పర్యావరణం దెబ్బతింటుందని తెలిపారు. వ్యర్దాలు కాల్చితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం 25 వేల వరకు జరిమానా విధించడానికి అవకాశం ఉందని తెలిపారు. భగీరథ నీటి సరఫరా పర్యవేక్షణ చేయాలన్నారు. మంచినీటి సమస్య ఏర్పడితే తన దృష్టి తీసుకురావాలని సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. వేసవిలో చేపట్టిన చర్యల వల్ల గ్రామాల్లో సమస్యలు రాకుండా చేశామని, భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే తక్షణం పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ యొక్క సమావేశం ముఖ్య విధి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆయన పేర్కొన్నారు. విధులు అధికారాలు గురించి చట్టం గురించి తెలుసుకోవాలని గ్రామ పంచాయితీలో పర్యటించడం వలన గ్రామాలు స్వచ్ఛతను సంతరించుకుంటాయని పేర్కొన్నారు. ప్రతి వారంలో రెండు లేదా మూడుసార్లు తప్పనిసరిగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.
శిక్షణ కార్యక్రమంలో విదులు అధికారాలపై సమగ్రమైన, స్పష్టమైన అవగాహన పెంపొందించుకోవాలని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ఆయన పేర్కొన్నారు. వ్యాపార, మాంసాహార వ్యాపారులతో సమావేశాలు నిర్వహించి ప్లాస్టిక్ వినియోగం తగ్గించే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు.అమ్మపేరున మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలన్నారు. వనరుల ద్వారా ఆదాయం సమకూరే లా ప్రణాళికలు తయారు చేయాలని తెలిపారు.అనంతరం గ్రామ పంచాయతి కార్మికులను శాలువాతో సత్కరించి సేవలను అభినందించారు.అనంతరం స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేపించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కలెక్టర్ విజయలక్ష్మి, డిపిఓ నారాయణరావు, మండల ప్రత్యేక అధికారి సంజీవరావు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *