రామనామ జపంతో మారుమోగిన ఆలయాలు
సిరా న్యూస్,జగిత్యాల;
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.భక్తులరామనామ జపంతో ఆలయాలు మారుమ్రోగాయి.
ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి వివిధ హనుమాన్ ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల పట్టణంలోని జoబిగద్దె హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అహల్య దంపతులు ,రాంచంద్రారెడ్డి,కాంగ్రెస్ నాయకులు గాజంగి నందయ్య, బండ శంకర్, జున్ను రాజేందర్ తదితరులు పాల్గొని పూజలు చేశారు.
అయోధ్యలోని రామ జన్మభూమిలోబాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులకు అయోధ్య రామాలయ అక్షింతలను వితరణ చేశారు.శ్రీరామ తీర్థట్రస్ట్ అయోధ్య వారికరీంనగర్ విశ్వహిందూ పరిషత్ గోరక్ష విభాగ్ ప్రముఖ్ ఊట్కూరి రాధాకృష్ణ రెడ్డి ,జిల్లా అధ్యక్షులు పద్మాకర్ రావుల ఆధ్వర్యంలో అక్షింతలు కొండగట్ట్టుకు తీసుకురాగా అర్చకులు మేళతాలలతో ఆలయ సిబ్బంది స్వాగతం పలికిఆలయంలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సీతా సమేత శ్రీరామ, లక్ష్మణ,ఆంజనేయ స్వాములఉత్సవ మూర్తులకు ఆలయంలో ప్రధాన అర్చకులు జితేంద్ర ప్రసాద్ అర్చకులు పంచామృతాలతో అభిషేకించి రామనామ జపంతో అంగరంగవైభవంగాప్రత్యేకంగా పూజలు చేసి భక్తులకు అక్షింతలను అందజేశారు.విశ్వహిందూ పరిషత్ నాయకులను ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, సామంత రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మణ్, మలేశం, వంగల అమర్, యష్వంత్ రెడ్డి, శ్రీధర్, కొండగట్టు ఆలయ ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.