సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ ఎస్ఆర్ డిజి లో మహిళ సాధికారత పై అవగాహన…
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల ఎస్ఆర్ డిజి స్కూల్ లో మహిళా సాధికారతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా మహిళా సాధికారత అధికారి యశోద, సఖీ కేంద్రం నిర్వాహకులు సరస్వతి, విద్యార్థులకు మహిళల రక్షణ చట్టాల గురించి వివరించారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ముందుకు సాగిపోవాలని సూచించారు. మగవారితో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినిలు, వివిధ ధీర వనితల పాత్రలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచింపచేసాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల జోనల్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ క్రాంతి కుమార్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.