సిరా న్యూస్, ఆదిలాబాద్:
సాఫ్ట్‌బాల్‌లో సత్తా చాటిన ఎస్‌ఆర్ డిజి విద్యార్థులు
ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల ఎస్‌ఆర్ డిజికి చెందిన విద్యార్థులు సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో సత్తా చాటారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాలికల సబ్ జూనియర్ పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా జట్టు రెండో స్థానంలో నిలవగా, అందులో ఎస్‌ఆర్ డిజికి చెందిన 8వ తరగతి విద్యార్థినిలు లక్ష్మీ సంకీర్తన, వైష్ణవిలు పాల్గొన్నారు. కాగా ఈ నెల 23న భువనగిరి జిల్లా ఆలేరులో నిర్వహించిన బాలుర రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా టీం మూడో స్థానంలో నిలిచింది. ఈ టీంలో ఎస్‌ఆర్ డిజికి చెందిన 9వ తరగతి విద్యార్థులు అఖిల్, అభిషేక్, 8వ తరగతి విద్యార్థులు ఇంద్రజిత్, ప్రేమ్‌దాస్, శ్రీరామ్, 7వ తరగతి విద్యార్థి ధనుష్‌లు పాల్గొన్నారు.
నేషనల్స్‌కు ఎంపికైన ఇంద్రజిత్…
ఎస్‌ఆర్ డిజికి చెందిన 8వ తరగతి విద్యార్థి సబ్‌జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ క్రాంతి కుమార్ తెలిపారు. మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు ఇంద్రజిత్ హాజరుకానున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా సాఫ్ట్‌బాల్ పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులను పాఠశాల జోనల్ ఇంచార్జి శ్రీనివాస్, ప్రిన్సిపల్ క్రాంతి కుమార్, వైస్ ప్రిన్సిపల్ సంతోష్, పీఈటీ రూపేష్, ఇతర ఉపాద్యాయులు సన్మానించి, అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో క్రీడల్లో మరింత రాణించాలని ఆశాభావం వ్యక్తం చేసారు.