SR Educational Society: ఆదివాసీ జిల్లా ఆదిలాబాద్‌లో ఎస్‌ ఆర్‌ ప్రభంజనం

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

ఆదివాసీ జిల్లా ఆదిలాబాద్‌లో ఎస్‌ ఆర్‌ ప్రభంజనం
+ 14ఏళ్లుగా నాణ్యమైన విద్యా సేవలు
+ నామ మాత్రపు ఫీజులతో కార్పోరేట్‌ విద్య
+ పదిలో ప్రతీ ఏడు 100 శాతం ఉత్తీర్ణత
+ ఇంటర్‌తోనే ఐఐటీ, నీట్‌ ప్రిపరేషన్‌
+ గేమ్స్, స్పోర్ట్స్, కల్చరల్‌ అక్టివిటీస్‌కి సైతం పెద్ద పీట

ఆదివాసీల జిల్లాగా పిలిచే ఆదిలాబాద్‌లో గడిచిన 14ఏళ్లుగా ఎస్‌ ఆర్‌ విద్యా సంస్థలు కార్పోరేట్‌ స్థాయి విద్యను అందిస్తూ జిల్లా వాసుల మన్ననలను పొందుతున్నారు. పేద, మద్య తరగతి విద్యార్థులకు సైతం అందుబాటులో ఉండేలా తక్కువ ఫీజులతో డిజిటల్‌ క్లాస్‌ రూంలలో అత్యుత్తమ విద్యను అందిస్తూ, ఆదిలాబాద్‌లో నంబర్‌ వన్‌గా నిలుస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 95కు పైగా విద్యాలయాలు కలిగిన ఎస్‌ ఆర్‌ విద్యా సంస్థల యాజమాన్యం 2010–20211లో మొదటి సారిగా ఆదిలాబాద్‌ పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో ఎస్‌ ఆర్‌ డిజి స్కూల్‌ను ప్రారంభించింది. అనంతరం 2016–2017లో ఎస్‌ ఆర్‌ జూనియర్‌ కాలేజీతో పాటు ఎస్‌ ఆర్‌ ప్రైమ్‌ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆదిలాబాద్‌ ప్రజలకు మొట్టమొదటి సారిగా డిజిటల్‌ క్లాస్‌రూంలు, ఐఐటీ, నీట్‌ ఫౌండేషన్‌ కోర్స్‌లను పరిచయం చేసిన ఎస్‌ ఆర్‌ డీజీ ప్రతీ ఏట ర్యాంకులతో తన సత్తా చాటుకుంటోంది. దీనిపై ‘సిరా న్యూస్‌’ ప్రత్యేక కథనం…

ప్రతీ ఏట పదిలో 100శాతం…

పదవ తరగతి పరీక్షల్లో ప్రతీ ఏట 100శాతం ఉత్తీర్ణత సాధించడం ఎస్‌ ఆర్‌ డీజీ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు విద్యార్థులు ప్రతీ సంవత్సరం పదవ తరగతిలో 10జీపీఏలను క్రమం తప్పకుండా సాధించడం ఎస్‌ ఆర్‌ విద్యా సంస్థల నాణ్యమైన చదువులకు నిదర్శనంగా నిలుస్తోందని చెప్పవచ్చు. విద్యార్థులకు డిజిటల్‌ తరగతులతో పాటు సైన్స్‌ ల్యాబ్, కంప్యూటర్‌ ల్యాబ్, లైబ్రరీ వంటి అత్యుత్తమ సౌకర్యాలు కల్పించడంతో ఏటేట అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది ఎస్‌ ఆర్‌ డీజీ.

ఐఐటీ, నీట్‌ల కోసం స్పార్క్‌ అండ్‌ షార్ప్‌…

విద్యార్థులకు చిన్న తరగతుల నుండే ఐఐటీ, నీట్‌ వంటి ఫౌండేషన్‌ కోర్సులను ఎలాంటి అదనపు రుసుము లేకుండా అందిస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్పార్క్, షార్ప్‌ల పేరిట ప్రత్యేకమైన ఫౌండేషన్‌ కోర్సులను రూపొందించిన యాజమాన్యం విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఐఐటీ, నీట్‌ పరీక్షలపై పట్టు సాధించేలా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. దీంతో ప్రతీ ఏట ఇంటర్‌ తరువాత నేరుగా నీట్, జేఈఈ పరీక్షలకు విద్యార్థులు అర్హత సాధిస్తున్నారని చెప్పవచ్చు. ఎలాంటి లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌లు అవసరం లేకుండా ప్రతీ ఏట ఇంటర్‌ తరువాత పదుల సంఖ్యలో విద్యార్థులు నీట్, జేఈఈలకు అర్హత సాధించడం ఎస్‌ ఆర్‌ జూనియర్‌ కళాశాలకే సాధ్యమని చెప్పవచ్చు.

స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ అక్టివిటీసీలోను ముందంజ…

NEET 2023-24

చదువుతో పాటు ఆట, పాటలు ఉంటేనే విద్యార్థుల సమగ్ర వికాసం జర్గుతుందని నమ్మిన ఎస్‌ ఆర్‌ విద్యా సంస్థలు తమ పాఠశాలల్లో ప్రతీ శనివారం, పండగ రోజుల్లో ప్రత్యేక కల్చరల్‌ అక్టివిటీసీ, సెమినార్‌లను నిర్వహిస్తోంది. ఇటీవల ఆదిలాబాద్‌ ఎస్‌ ఆర్‌ డీజీ నుండి ఆథ్యాపాట్య, షూటింగ్‌ బాల్‌ వంటి పోటీలకు ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయిలో ఎంపిక కావడంతో పాటు సాఫ్ట్‌ బాల్‌ పోటీలకు సైతం మరో ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జర్గింది. కేవలం చదువు మాత్రమే కాకుండ ఆట పాటలు, వివిద రకాల పోటీ పరీక్షలకు అవసరమైన కోచింగ్‌ను అందిస్తూ పేద, మద్య తరగతి విద్యార్థుల పాలిట వరంగా మారింది ఎస్‌ ఆర్‌. దీనికి తోడు విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించే విదంగా ప్రతీ ఏట పోలీసులు, వైద్యులు, ఉన్నత అధికారులు, మానసిక నిపుణులతో కౌన్సెలింగ్‌ తరగతులు నిర్వహిస్తున్న ఎస్‌ ఆర్‌ విద్యా సంస్థలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషీ చేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

NEET 2022-2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *