సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
పిల్లలను అంగన్‌వాడీ స్కూల్‌కు పంపించాలి : కౌన్సిలర్ నాయిని స్రవంతి సంతోష్
* ఖానాపూర్‌లో అమ్మ మాట అంగన్వాడి బాట
పిల్లలను అంగన్‌వాడీ స్కూల్‌కు పంపించాలని కౌన్సిలర్ నాయిని స్రవంతి సంతోష్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీ అంగన్వాడి సెంటర్ లో గురువారం అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈసందర్బంగా కౌన్సిలర్ నాయిని స్రవంతి సంతోష్ మాట్లాడారు. అంగన్వాడి సెంటర్లో ప్రభుత్వం అన్ని విధాలుగా పౌష్టికాహారం అందిస్తుందని తెలిపారు.అంగన్వాడి స్కూల్ కి తల్లిదండ్రులు పిల్లలని తీసుకురావాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ నగర్ అంగన్వాడి స్కూల్ ఉపాధ్యాయులు గంధ్యాల చంద్రాణి, చంద్రకళ, స్కూలు ఉపాధ్యాయులు మురళి పాల్గొన్నారు.