సిరాన్యూస్, బోథ్
మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి ముందస్తు అరెస్ట్
గతంలో చేసిన పనులకు బిల్లుల చెల్లింపులు జరగకపోవడంతో అందుకు నిరసనగా మాజీ సర్పంచ్ ల సంఘం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. అయితే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను పలువురు సర్పంచులు హైదరాబాద్ వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఈ సమాచారం అందుకున్న బోథ్ పోలీసులు పిప్పలదరి మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.