సిరా న్యూస్, బోథ్
విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి: సైకాలజిస్ట్ శ్రీకాంత్
విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పొగాకు నియంత్రణ విభాగం జిల్లా క్లినికల్, సైకాలజిస్ట్ శ్రీకాంత్ పేర్కొన్నారు .గురువారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పొగాకు, ధూమపానం, మద్యం, డ్రగ్స్ వినియోగంపై విద్యార్థులకు అవగాహన కలిగించారు. మత్తు పదార్థాలు సేవించడం వల్ల అనారోగ్యం పాలు కావడంతో పాటు ప్రాణాలకు హాని చేకూరుతుందన్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని, మత్తు పదార్థాలు సేవిస్తే మానసికంగా ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు.