సిరాన్యూస్, రాజన్న సిరిసిల్ల
హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనలో ప్రభుత్వ విప్ శ్రీనివాస్
కోనరావుపేట మండలం కొలనూరు(గొల్లపల్లె) గ్రామంలో బుధవారం ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈసందర్భంగా స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు..ఆ స్వామి వారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామానికి ఇలాంటి కీడు రాకుండా స్వామి చల్లని దీవెనలు ఉండాలని వేడుకున్నారు. అనంతరం ప్రభుత్వ విప్ ను ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.