సిరా న్యూస్,శ్రీశైలం;
శ్రీశైల జలాశయం గేట్లు తెరుచుకున్నాయి.ఎగువన కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయిలో నిండుకుంది.ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు గాక ప్రస్తుతం 880 అడుగులు దాటింది..పూర్తిస్థాయి నీటిమట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 180 టీఎంసీలకు చేరింది.దీంతో డ్యాం మూడు గేట్లను 10 అడుగులా మేర ఎత్తి దిగువకు నీటిని డ్యాం అధికారులు,ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. మూడు గేట్లను ఎత్తి సుమారు 80వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేశారు.ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసేందుకు ఉదయం నుంచి కూడా సైరన్ మోగిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.మత్స్యకారులను సైతం ఎవరు చేపల వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.