స్వామి వారి కళ్యాణాన్ని తిలకించిన పలువురు భక్తులు
సిరా న్యూస్,బద్వేలు;
గడప గడపకు గోవు గోవిందు గీత లక్ష్యసాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలలో నిర్వహిస్తున్న జన జాగరణ కార్యక్రమంలో భాగంగా 34,వ రోజు శుక్రవారం బద్వేల్ మున్సిపాలిటీ పరిధి వాసవి అపార్ట్మెంట్లో శ్రీ మాన్ గట్టు అరుంధతి రంగాచార్యులు, శ్రీవారి తిరుమల మహా పాదయాత్ర ప్రముఖ నాగమల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రత్యేక బ్యాండ్ మేల తాళాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది, ముందుగా వాసవి అపార్ట్మెంట్ సెక్రటరీ తుమ్మలపెంట సురేష్ బాబు వారి స్వగృహంలో స్వామివారికి పాదాలకు అభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారికి పట్టు వస్త్రాలు పలువురు అపార్ట్మెంట్ వాసులతో కలిసి తీసుకొని వచ్చారు, అనంతరం పలువురు భక్తులు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ అధ్యక్షులు పి,వి,ఎన్ ప్రసాద్, సెక్రటరీ తుమ్మలపెంట సురేష్ బాబు, ట్రెజరర్ కిషోర్ కుమార్, ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కే.వి సుబ్బారావు, అడ్వకేట్ పత్తి నాగేంద్రప్రసాద్, సముద్రాల సుబ్బారావు (గురు), బెస్త వేముల సుబ్బారావు,చాట కొండు వెంకటసుబ్బయ్య, వళ్లం కొండు సత్య నారాయణ, టి,సురేష్ బాబు, చింత కుంట కృష్ణ మూర్తి, రాధయ్య , సుబ్రమన్యం, వాసవి క్లబ్ అధ్యక్షుడు భార్గవ్,వానిత క్లబ్ అధ్యక్షురాలు జ్యోతిర్మయి, పట్టణ ప్రజలు అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు