సిరా న్యూస్,నెల్లూరు;
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ రోజు శ్రీహరికోట రాకెట్ ప్రయోగకేంద్రం నుండి 9 గంటల 17 నిమిషాలకు ఎస్ఎస్ఎల్వీ డీ 3 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది,ఈ రాకెట్ ద్వారా ఈఓఎస్ -08 ఉపగ్రహాన్ని 475 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్ష కక్షలో నిలిపింది, ప్రయోగం జరిగిన 14 నిమిషాలకు ఈఓఎస్ ఉపగ్రహం కక్షలోకి చేరుకోవడం జరిగింది, దింతో పాటుగా మరో SR జీరో డెమోసాట్ ను కూడా విజయవంతముగా కక్షలో నిలపడం జరిగింది, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ – డి3 రాకెట్ ప్రయోగం ద్వారా ఎర్త్ అభ్జర్వేషన్ – 08 ఉపగ్రహం ఏడాది పాటు సేవలు అందించే విదంగా ఇస్రో రూపొందించడం జరిగింది, 500 కిలోమీటర్ల ఎత్తు లోని కక్షలోకి 500 కిలోల బరువు కలిగిన ఉపగ్రహాలను తీసుకువెళ్లడం కోసం ఈ రాకెట్ ఉపయోగపడుతుంది, ఇస్రో ప్రయోగించే నానో ఉపగ్రహాలు,మైక్రో ఉపగ్రహాలను ,మినీ శాటిలైట్లను తక్కువ ఖర్చుతో ప్రయోగించడం కోసం ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ని ఇస్రో తయారు చేయడం జరిగింది,34 మీటర్లు ఎత్తు 120 టన్నులు బరువు కలిగిన ఎస్ఎస్ఎల్వీ రాకెట్ కు భవిష్యత్ లో ప్రపంచ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉటుందని ఇస్రో అంచనా వేసింది,ఇస్రో ప్రయోగించిన ఈవోఎస్ -08 భూపరిశీలన ఉపగ్రహం ఇందులో ప్రధానముగా మూడు పేలోడ్స్ ఉంటాయి,వాతావరణ మార్పులను గుర్తించడం,ప్రక్రుతి విపత్తులు గురించి ముందుగా తెలియజేయడం,అగ్నిపర్వతాలు కార్యాకలాపాల పరిశీలన కోసం ,పవర్ ప్లాంట్ల విపత్తుల పర్యవేక్షణకు,అలాగే సముద్ర ఉపరితలం గాలులు విశ్లేషించడానికి,నేలలో లో ఉన్న తేమ ను అంచనావేయడానికి,హిమాలయాలలోని క్రియోస్పియర్ అధ్యనం కోసం ఈవోఎస్ – 08 ఉపగ్రహం ప్రధానముగా పనిచేస్తుంది, ఈ ఉపగ్రహం 175 కిలోల బరువు కలిగి ఉంది,ఇస్రో చైర్మన్ సోమనాధ్ పర్యవేక్షణలో ఈ ప్రయోగం జరిగింది.