సిరాన్యూస్,నేరడిగొండ
క్రమబద్దీకరణ హామీ నిలబెట్టుకోవాలి : సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్
* ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు వినతి పత్రం అందజేత
సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్ అన్నారు. సీఎం హామీ ఇచ్చిన దినం సందర్బంగా సీఎం ప్రామిస్ డే శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్బంగా అనంతరం అనిల్ జాదవ్ సమగ్ర ఉద్యోగుల రెగ్యులరైజ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అనంతరం సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రెగ్యులరైజ్ చేస్తామని బేసిక్ పే ( మినిమం టైం స్కేల్ ) అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చి ఇప్పుడు తస్సారం చేస్తున్నారని ఆరోపించారు. గత కొన్ని నెలలుగా ముఖ్యమంత్రితో సహా మంత్రులను అనేకసార్లు కలిసిన తమ సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో ఆందోళన చేపడుతున్నామన్నారు. తమను రెగ్యులరైజ్ చేసే వరకు దశలవారీగా ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు . అనంతరం సంఘం జిల్లా అధ్యక్షులు భోజన్న మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇచ్చిన గ్యారంటీ నిలబెట్టుకోవాలని, సమగ్ర శిక్షా ను విద్యాశాఖ లో విలీనం చేసి, ఉద్యోగులను క్రమబద్దీకరణ చేయాలనీ కోరారు. కార్యక్రమం సంఘం నేతలు, పార్థసారథి, మమత,వినోద్, సురేందర్ ఉద్యోగులు పాల్గొన్నారు..