సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
బీఆర్ఎస్‌కి నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు లేదు
కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు బానవత్ గోవింద్ నాయక్
బీఆర్ఎస్‌కి నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు లేదని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు బానవ త్ గోవింద్ నాయక్ అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాణావత్ గోవింద్ నాయక్ మాట్లాడారు. పది ఏళ్ళు కాలంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పనా లేకుండా తీవ్రమైన ఇబ్బందులకు గురిచేసిన బిఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందన్నారు. కేసీఆర్ హయాంలో 5 వేల పై చిలుకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 11 వేలతో నోటిఫికేషన్ ఇచ్చిందని తెలిపారు. తెలంగాణలో పోరాటాలు, ఆందోళనలు లేకుండా నిరుద్యోగ యువతకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని అన్నారు.