సిరా న్యూస్,ఖానాపూర్
ఎమ్మెల్యే కోవ లక్ష్మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి
* మంత్రి సీతక్కపై విమర్శలు చేయడం సిగ్గు చేటు
* నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ మతిస్థిమితం కోల్పోయి విమర్శలు చేయడం సిగ్గుచేటని, మంత్రి సీతక్కను, కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని నిర్మల్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.మంత్రి సీతక్క పై , కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. జిల్లా కాంగ్రెస్ నాయకులపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే కోవా లక్ష్మీ భేషరతుగా వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ఎజెండాగా రాష్ట్రంతో పాటు ఆసిఫాబాద్ నియోజకవర్గాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉందన్నారు.