ST SC JAC Chelimappa: ఆర్టీవో కార్యాలయాన్ని తక్షణమే ప్రారంభించాలి : ఎస్సీ, ఎస్టీ జేఏసీ తాలూకా అధ్యక్షులు చెలిమప్ప

సిరాన్యూస్, కళ్యాణదుర్గం
ఆర్టీవో కార్యాలయాన్ని తక్షణమే ప్రారంభించాలి : ఎస్సీ, ఎస్టీ జేఏసీ తాలూకా అధ్యక్షులు చెలిమప్ప
* కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి పాటు పడాలి
* ఆర్డీవోకు వినతి పత్రం అంద‌జేత‌

మూడు సంవత్సరాల క్రిందట మంజూరు అయిన ఆర్టీవో కార్యాలయాన్ని తక్షణమే ప్రారంభించాల‌ని ఎస్సీ, ఎస్టీ జేఏసీ తాలూకా అధ్యక్షులు చెలిమప్ప అన్నారు. ప‌లు డిమాండ్ల‌తో కూడిన విన‌తి ప‌త్రాన్ని ఆర్డీవోకు అంద‌జేశారు. ఈసంద‌ర్బంగా జేఏసీ తాలూకా అధ్యక్షులు చెలిమప్ప మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజవర్గానికి మూడు సంవత్సరాల క్రిందట మంజూరు అయిన ఆర్టీవో కార్యాలయం ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేద‌న‌నారు. ఈ మధ్యకాలంలోనే ప్రభుత్వం వారు ఆర్టిఓ అధికారిని, కొంతమంది సిబ్బందిని నియమించారని, కళ్యాణ్ దుర్గం ఆర్టీవో కార్యాలయం లేక అనంతపురం జిల్లా కేంద్రం నుండే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మసముద్రం కంబదూరు, కుందుర్పి, సెట్టూరు కళ్యాణదుర్గం బెలుగుప్ప గుమ్మగట్ట దాదాపు పది నుండి 12 మండలాల ప్రజలు అనంతపురం జిల్లా నూరు కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రక్కన కర్ణాటక రాష్ట్రంలోని ఆర్టీవో సేవలనువినియోగించుకుంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ప్రక్రియ వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వా ఖజానాకు గండు పడుతుందని తెలిపారు. అనంత‌రం జిల్లా జేఏసీ దోనతిమ్మప్ప మాట్లాడుతూ ప్రభుత్వం వారు పలు సర్వీసుల నిర్వహించి జారీ చేసిన ఆర్టీవో కార్యాలయాన్ని కొంతమంది అధికారులు స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్టిఓ ను గుంతకల్లు డివిజన్ కు బదులు చేయించాలని, ప్రయత్నంలో ఉన్నారనీ ఈ విషయాన్ని గమనించాల‌ని తెలిపారు. కార్యక్రమంలోఎస్సీ ఎస్టీ జేఏసీ తాలూకా అధ్యక్షులు చెలమప్ప ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా నాయకులు దోన తిమ్మప్ప, నాయకులు చనమల్లి తిప్పేస్వామి నాగరాజు నారాయణ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *