సిరా న్యూస్,వికారాబాద్;
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మెున్న జరిగిన టీఎస్ పిఎస్సి ముట్టడిలో యువమెూర్చ నాయకులపైన పోలీసులు విచక్షణ రహితంగా గాయపర్చడం పై ఈ రోజు తెలంగాణ లోని ప్రతి జిల్లాలో కూడా సీఎం దిష్టి బొమ్మలు దహనం చేయడం జరుగుతుందని అందులో బాగంగానే రోజు వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశామని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మరియు సిఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలండర్ విడుదల చేయలని వారు డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున నిరసనలు చేయాల్సి వస్తుందని తెలిపారు.
=====