మత్తు మందు పై ఉక్కుపాదం

సిరా న్యూస్,హైదరాబాద్;
రాష్ట్రంలో శాంతిభద్రతల సంరక్షణలో అలసత్వానికి తావివ్వొద్దని డీజీపీ జితేందర్ ఆదేశించారు. సీఎం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముందు డీజీపీ తన కార్యాలయంలో ఎస్పీలు, కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై మాట్లాడారు. ‘ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులన్నీ తప్పనిసరిగా పరిష్కారమయ్యేలా చూడాలి. పోలీస్ స్టేషన్లకు వచ్చేవారితో మర్యాదపూర్వకంగా మసలుకోవాలి. ఎక్కడా విమర్శలకు తావులేకుండా ప్రవర్తించాలి. క్షేత్రస్థాయిలో పోలీసింగ్ను మెరుగుపరిచేందుకు ఎస్పీలు, కమిషనర్లతోపాటు ఇతర అధికారులు తరచూ తనిఖీలు నిర్వహిస్తుండాలి. శాంతిభద్రతలను ఎప్పటికప్పుడు సమీక్షించాలి. పోలీసింగ్పై ప్రజల స్పందన తెలుసుకోవాలి. రాష్ట్రంలో మత్తుమందుల ఊసే వినపడకూడదని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారు. అందుకు అంతా కలిసికట్టుగా కృషిచేయాలి. అవసరమైతే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చే ఆలోచన కూడా ఉంది. పోలీస్ స్టేషన్ల వారీగా డ్రగ్స్ నివారణపై దృష్టి పెట్టాలి. ఎస్సీ-ఎస్టీలు, మహిళలకు సంబంధించిన కేసుల విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలి అని డీజీపీ ఆదేశించారు. సమావేశంలో అదనపు డీజీలు మహేశ్ భగవత్, శిఖా గోయల్, అభిలాష బిస్త్, వి. వి. శ్రీనివాసరావు, విజయ్కుమార్, స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు శ్రీనివాసరెడ్డి, అవినాష్ మొహంతి, సుధీర్బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *