సిరా న్యూస్,అమలాపురం..;
ఎన్నికల ఫలితాలు దగ్గర పడుతున్న వేళ కోనసీమలో స్టిక్కర్లు కలకలం రేపుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురంలో సోషల్ మీడియాలలో స్టిక్కర్లు వైరల్ అవుతున్నాయి. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ,ఎంపీ హరీష్ తాలూకా అంటూ టీడీపీ నేతల స్టిక్కర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వైసీపీ నుండి అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ గారి తాలూకా అంటూ స్టిక్కర్లు హల్చల్. కోనసీమ జిల్లాలో ఉన్న వాట్సప్ గ్రూపులలో రెండు పార్టీల నేతల స్టిక్కర్లు హల్చల్ చేస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సోషల్ మీడియాలో అభ్యర్థుల స్టిక్కర్ల పోస్టింగ్ ల రాజకీయం కలకలం రేపుతున్నాయి.