సిరాన్యూస్, కుందుర్పి
ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను నిలిపివేయాలి : ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్ కే. కృష్ణమూర్తి
ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను నిలిపివేయాలని ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్ కే. కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం కుందుర్పి మండల శాఖ తరఫున మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈసందర్బంగా ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్ కే. కృష్ణమూర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సర్దుబాటు నిర్వహణను జీవో నెంబర్ 117 ప్రకారం కాకుండా, జీవో నెంబర్ 53 ప్రకారం చేయాలని సూచించారు. అలాగే పాఠశాలలో మిగులు ఉపాధ్యాయుని గుర్తించేటప్పుడు క్యాడర్‌లో ర్యాంకు ప్రకారం గుర్తించాలని అన్నారు. పుట్టిన తేదీ ఆధారంగా సీనియారిటీని గుర్తించడం సరికాదని సూచించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు వై. రాజు, ప్రధాన కార్యదర్శి కె. రేవన్న, జిల్లా కార్యదర్శి రాధాకృష్ణం రాజు, ఉపాధ్యాయ వాణి జిల్లా కన్వీనర్హనుమంతప్ప, జిల్లా కౌన్సిలర్లు జే. జయరాములు, శివలింగప్ప, జె. కృష్ణమూర్తి, సిపిఎస్ మండల కన్వీనర్ తిప్పే స్వామి, మండల నాయకులు మల్లికార్జున, మంజునాథ, రాజశేఖర్, లోకేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.