సిరా న్యూస్,ఓదెల
చెస్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన విద్యార్థి అనుకాల సిద్దార్థ
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎంజేపీ అండర్ -14 చెస్ పోటీల్లో గోదావరిఖని మహాత్మ జ్యోతిబా పూలే స్కూల్‌కు చెందిన విద్యార్థి అనుకాల సిద్దార్థ ప్రథమ బహుమతి సాధించారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ లో నిర్వహించిన ఎంజేపీ అండర్ 14 చెస్ పోటీలో 12 స్కూలు పాల్గొన్నాయి. పోటీల్లో ఆరుకాల సిద్ధార్థ కరీంనగర్ జిల్లా చాంపియన్ గా మొదటి బహుమతి సాధించారు. ఈ విజయంతో సిద్ధార్థ ను చెస్ స్టేట్ లెవెల్ ఎంపికయ్యాడని చెస్ పోటి నిర్వాహకులు తెలిపారు. ఈసందర్బంగా ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మాజీ ఎంపిటిసి బోడకుంట లక్ష్మి చిన స్వామి సిద్ధార్థ కు అభినందనలు తెలిపారు.