బంధువుల అందోళన
సిరా న్యూస్,నల్గోండ;
నల్లగొండ జిల్లా, కొండమల్లేపల్లి ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్ధిని అనుమానాస్పద మృతి పై పేరెంట్స్ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఉదయం ప్రేయర్ టైంలో 9వ తరగతి విద్యార్దిని దాసరి భార్గవి” అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది. మొదట స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సీరియస్ గా ఉండడంతో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయారు. ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు తేల్చారు.
అంగడిపేట గ్రామం, పిఏ పల్లి మండలానికి చెందిన భార్గవి.. తండ్రి ఆంజనేయులు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు వచ్చి చూసిసరికి.. కూతురు చనిపోవడం, దాని మీద అనుమానం ఉన్నదని మృతురాలి తండ్రి దాసరి ఆంజనేయులు ఆరోపించారు. తల్లిదండ్రులు కుటుంబీకులతో సహా మృతురాలికి మద్దతుగా విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడంతో.. పోలీసులు నచ్చజెప్పి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.