సిరా న్యూస్, ఆదిలాబాద్
పరీక్షల్లో నిమిషం నిబంధనను ఎత్తివేయాలి
* విద్యార్థి సంఘాల నాయకులు
* జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవీందర్ రెడ్డికి వినతి అందజేత
నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించవద్దని ఏదైతే నిబంధన ఉందో దాన్ని వెంటనే ఎత్తివేయాలని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. గురువారం పలు డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవీందర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టేకం శివకుమార్ విద్యార్థి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. అయితే ఆ విద్యార్థి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో తన మొదటి పరీక్షను రాయాల్సి ఉండగా, నిమిషం ఆలస్యం అయిన కారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కళాశాల సిబ్బంది లోనికి రానివ్వ లేదు. దీంతో విద్యార్థి తీవ్ర మనస్థాపానికి గురై సూసైడ్ నోట్ రాసి సాత్నాల ప్రాజెక్టులో దూకి చనిపోవడం జరిగిందని తెలిపారు. వెంటనే పరీక్షల్లో నిమిషం నిబంధనను ఎత్తివేయాలని, ఈ యొక్క సంఘటనపై ప్రభుత్వం స్పందించి, విద్యార్థి కుటుంబానికి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల జేఏసీ కన్వీనర్ బి రాహుల్, ఏఐఎఫ్‌డీ ఎస్ జిల్లా కార్యదర్శి కుంటాల నవీన్ కుమార్, టీఏజీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పూసం సచిన్, ఏఎస్‌యూ జిల్లా కార్యదర్శి మరసకుల అశోక్, టీఎస్ఎఫ్ జిల్లా నాయకులు సత్యనారాయణ, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు సిడం సాయికుమార్, ఎస్‌వీఏ జిల్లా అధ్యక్షులు గొప్లే సుజయ్ ఇఫ్తేకర్. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు