చెట్టుకు ఢీకొని స్విఫ్ట్ కారు పల్టీ.
ఒక్కరూ మృతి ఇద్దరికీ గాయాలు.
సిరా న్యూస్,మేడ్చల్;
విద్యార్దులు మద్యం మత్తులో కారు నడిపారు. అదుపు తప్పిన కారు చెట్టుకు ఢీకొంది. ఘటనలో రాచకొండ కమిషనరేట్ కీసర పోలీస్ స్టేషన్ పరిధి బొగారంలో హోలీ మేరి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి రాజేందర్ మృతిచెందాడు. రాజేందర్ మద్యం మత్తులో కారు నడిపాడు. స్విఫ్ట్ డిజైర్ కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికీ గాయాలుఅయ్యాయి. కారులో ఉన్న ముగ్గురు విద్యార్థులు రాజేందర్,విశ్వ,యశ్వంత్. రాజేందర్ స్వస్థలం ధర్మపురి.
రాజేందర్ ప్రస్తుతం ఘాట్ కేసర్ లోని ప్రయివేట్ హాస్టల్ లో ఉంటున్నాడు. మృతి చెందిన రాజేందర్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ హాస్పటల్ కి తరలించారు.
======